బిగ్ బాస్ లో మిషన్ ఇంపాజిబుల్ !
on Nov 2, 2022
బిగ్ బాస్ హౌస్ లో కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ పేరు 'మిషన్ ఇంపాజిబుల్'. బిగ్ బాస్ ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ ని రెండు టీంలు గా, ఒకటి రెడ్ టీం, మరొకటి బ్లూ టీంలుగా డివైడ్ చేసాడు. అయితే రెడ్ టీం లో 'శ్రీహాన్, గీతు, కీర్తి భట్, ఫైమా, శ్రీసత్య ఉండగా, బ్లూ టీంలో 'ఇనయా, వసంతి, ఆదిత్య, మెరీనా, రోహిత్, రాజ్ ఉన్నారు.
ఆట మొదలయ్యాక తోపులాట జరిగింది. ఇందులో ఇనయాకి, శ్రీసత్యకి వాగ్వాదం సాగింది. రేవంత్ ని పాలు కావాలని ఇనయా అడిగింది . దానికి రేవంత్ మాట్లాడుతూ, " పాలు కావాలంటే టైం పడుతుంది " అని అన్నాడు". ఆ తర్వాత "నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానా లేక జైల్లో ఉన్నానా, నాకు తలనొప్పిగా ఉంది కాఫీ కావాలి అంటే టైం పడుతుంది అని రేవంత్ అన్నాడు" అని ఇనయా బాధపడింది.
మొత్తానికి ఈ టాస్క్ తో గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఈ టాస్క్ వల్ల వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ అవుతున్నారు. స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. అయితే నిన్న మిన్నటి దాకా వీక్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఆదిత్య తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే నిన్నటి టాస్క్ లో , "ఆదిత్య వీక్ నెస్ మీద దెబ్బ కొట్టాలి. లైటర్ దాచిపెట్టు" అని శ్రీహాన్ తో, శ్రీసత్య అంది. "ఒక లైటర్ కి టూ బ్లూ స్ట్రిప్స్" అని గీతు అనగా, ఆదిత్యని రేవంత్ పక్కకి తీసుకెళ్తుండగా, "మీ టీం కదా రేవంత్, అందుకే మిమ్మల్ని అడగుతున్నాను. గెలిస్తే ఆటలో గెలవండి కానీ ఈ పిచ్చి ఏంది" అని అన్నాడు. ఆ తర్వాత రేవంత్ వాయిస్ పెంచి ఆదిత్యతో వాగ్వాదం కి దిగాడు. దీంతో ఆదిత్య, "మర్యాదగా మాట్లాడు రేవంత్" అని అన్నాడు.